సాయిధరమ్ తేజ పై కేసు నమోదు..

టాలీవుడ్ యంగ్ హీరో, మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్నరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 45 నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అతివేగంతో వెళ్ళడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అవ్వడం వల్ల కిందపడిపోయినట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఘటన విషయం తెలియడంతో.. పోలీసులు అక్కడికి చేరుకొని సాయి ధరమ్ తేజ్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా… యాక్సిడెంట్ కు గురి అయిన సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదైంది. రాయదుర్గం పోలీసులు హీరో సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం మరియు రాష్ డ్రైవింగ్ కింద… ఐపీసీ 3, 36,184 ఎంవీ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు.