వాటే స్కీమ్… ప్రతీ నెల ఐదు వేల రూపాయలు పొందొచ్చు…!

మీరు ప్రతీ నెల చేతికి డబ్బులు పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు మంచి స్కీమ్ ఒకటి అందుబాటు లో వుంది. దీని వలన మీకు మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ఒక స్కీమ్ ఉంది. ఇందులో చేరితో ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి.

ఈ స్కీమ్ పేరు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో చేరితే 6.6 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే వడ్డీ రేటు ప్రత మూడు నెలలకు ఒకసారి మారే ఛాన్స్ ఉంది. పోస్టాఫీస్‌కు వెళ్లి నేరుగా ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా నెలకు దాదాపు రూ.5 వేలు పొందొచ్చు.

ఇది ఇలా ఉంటే ప్రతి నెలా డబ్బులు పొందాలని భావిస్తే.. ముందుగా మీరు ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనితో మీకు ప్రతీ నెల మంచిగా డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్ గడువు ఐదేళ్లు. కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీనిలో ఏ రిస్క్ ఉండదు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది.

కనీసం రూ.1000తో కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. గరిష్టంగా సింగిల్ అకౌంట్ అయితే రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. అదే ఒకవేళ జాయింట్ అకౌంట్ ని కనుక మీరు ఓపెన్ చేస్తే…. రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు నెలకు రూ.5 వేలు పొందాలని భావిస్తే.. ఒకేసారి రూ.9 లక్షలు డిపాజిట్ చేయాలి. అదే మీరు రూ.4.5 లక్షలు పెడితే నెలకు రూ.2,500 వరకు వస్తుంది. ఇలా మీరు ప్రతీ నెల డబ్బులు పొందొచ్చు.