ఆక్సీజన్ అడ్డుకుంటే ఉరి తీస్తాం: హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆక్సీజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ వస్తున్న ఆక్సీజన్ వాహనాలను అడ్డుకుంటున్నారు అని సిఎం అరవింద్ కేజ్రివాల్ ఆరోపించగా దీనీపై ఢిల్లీ హైకోర్ట్… ఆక్సీజన్ వాహనాలను అడ్డుకుంటే ఉరి తీస్తామని హెచ్చరించింది.

ఢిల్లీ వచ్చే వాహనాలను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ మండిపడింది. రోజుకి 480 టన్నుల ఆక్సీజన్ పంపిస్తామని చెప్పిన కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసింది. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టంగా పేర్కొంది. ఆక్సీజన్ ట్యాంక్ లు అడ్డుకుంటున్న వివరాలను కేంద్రానికి తెలపాలని హైకోర్ట్ ఆదేశించింది.