సాధారణంగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో పిల్లలకు ఖచ్చితంగా హక్కు ఉంటుంది. కుటుంబ యజమాని తన కుటుంబంలోని పిల్లలందరికి ఆస్తిని సమానంగా పంచి తీరాలి. అయితే కొన్ని సార్లు ఇలా జరగదు. కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ ఆస్తి వస్తుంటుంది. కొందరికి పూర్తి ఆస్తి దక్కుతుంది. కొందరికి అసలు ఆస్తే దక్కదు. ప్రస్తుతం దేశంలో ఈ ఆస్తి పంపకాల సమస్యలు చాలా ఎక్కువ అయ్యాయి. ఇక వీటన్నింటిని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటే సమస్య ఉండదు.
లేదంటే ఆస్తి పంపకాల విషయంలో అందరి మధ్య తగాదాలు రావడం మనం కామన్ గా చూస్తుంటాం. అయితే తమ పిల్లలకు ఆస్తులను సమానంగా పంచుతూ వీలునామ రాస్తారు చాలా మంది తల్లిదండ్రులు. తమ తదనంతరం వారి పిల్లల మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు ఉండకూడదని ఇలా చాలా మంది వీలునామా రాస్తారు.
ఇక వీలునామా విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో ఇప్పటికీ ఎన్నో రకాల చర్చలు సాగుతూనే ఉన్నాయి. మరి తండ్రి యజమాని అయితే పిల్లలందరికి సమానంగా ఆస్తిని ఖచ్చితంగా పంచుతారు. మరి ఆ ఆస్తికి యజమాని ఒకవేళ తల్లి అయితే, తల్లి పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికి పంచాలని చట్టం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తల్లి ఆస్తికి యజమాని అయితే ఆమె ఎలాంటి వీలునామా రాయకపోతే ఆ ఆస్తి కుమారుడు, కుమార్తెలకు సమానంగా పంచాలని చట్టం చెబుతుంది. ఆస్తి పై ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి మీదైనా పూర్వీకుల ఆస్తి మీద అయినా కొడుకుతో సమానంగా హక్కు ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం తెలుస్తున్న విషయం ఏమిటంటే.. తల్లి ఆస్తి మీద సమానంగా కూతుర్లకు హక్కు ఉంటుందని తెలిపారు. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబంలో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు ఇంకా సమానమైన బాధ్యతలు కలిగి ఉంటారు అని వివరించారు.
2005 తరువాత పూర్వీకుల ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు ఉంటుంది. కుమారుడితో పాటు కూతురు కూడా సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందవచ్చు. ఈ విధంగా డిమాండ్ చేసే రైట్ కొడుకు, కూతుళ్ళకు ఇద్దరికీ ఉంటుందని తెలుపుతుంది చట్టం. అయితే తల్లి వీలునామా రాసి అందులో కూతురు గురించి చర్చించకుండా కేవలం కొడుకుకు మాత్రమే ఆస్తి చెందుతుంది అని రాస్తే మాత్రం కూతురుకు ఆ ఆస్తి చెందదట. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా లేదా ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామాలో ఏది రాస్తే అదే చెల్లుతుందని చట్టం చెబుతుంది.