కూటమి హయంలో శవాల దిబ్బగా ఏపీ మారింది – వైసీపీ ఎమ్మెల్యేలు

-

నెల రోజుల్లోనే ఏపీని అప్పుల కుప్పగా మార్చారని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయంలో శవాల దిబ్బగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కు పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు. పాలన మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఫైర్ అయ్యారు.

కేవలం అప్పులు, దాడులు మీద ఫోకస్ పెట్టిందని.. హత్యలు అఘాయిత్యాలతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అట్టుడుకుతోందని ఆగ్రహించారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పథకాలు అమలు, అభివృద్ధి పనులు పక్కన పెట్టి హత్యాకాండ చేయిస్తోందని నిప్పులు చెరిగారు.

నెల వ్యవధిలో అప్పుల కుప్పగా మార్చారని… కనీసం దాడులకు హత్యలకు గురైన కుటుంబాలను కూడా పరామర్శ లేదని నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గవర్నర్ ను ఈ దాస్టీకల నుంచి కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరామని.. గవర్నర్ పట్టించుకోలేదు కాబట్టే అసెంబ్లీ బాయికాట్ చేశామన్నారు. ఓటాన్ బడ్జెట్ ను దోచుకోవటానికి, పథకాలు అమలు చేయకుండా ఉండటానికి ప్రవేశ పెడుతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news