కొత్త ఇల్లు కొంటె రూ.4 లక్షల తగ్గింపు… ఎలా అంటే…?

-

మీరు కొత్త ఇల్లుని కొంటున్నారా…? సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వాళ్లందరికీ ఇది ముఖ్యమైన విషయం. వీటిని మీరు తప్పక తెలుసుకోవాలి. ఇంటి కొనుగోలుపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. అదేమీ తక్కువ కాదండి ఏకంగా రూ.4 లక్షల వరకు బెనిఫిట్ ఉంది. మరి ఇప్పుడే పూర్తిగా దీని కోసం తెలుసుకోండి. ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80ఈఈ కింద మీరు పన్ను మినహాయింపు పొందొచ్చు. వివరాల్లోకి వెళితే… హోమ్ లోన్‌ మొత్తంపై చెల్లించిన వడ్డీ పై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరం లో గరిష్టంగా ఎంత పొందొచ్చు అనే విషయానికి వస్తే… రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద లభించే రూ.2 లక్షల పన్ను తగ్గింపునకు ఇది అదనం గుర్తుంచుకోండి. ఈ ప్రయోజనం హోమ్ లోన్ పూర్తిగా చెల్లించేంత వరకు ఉంటుంది. ఈ అవకాశం ఎవరికి ఉంటుంది అనే విషయానికి వస్తే… ఇంటి విలువ రూ.50 లక్షలకు లోపు ఉండాలి. ఇంటి కోసం తీసుకున్న రుణం రూ.35 లక్షలు లేదా అంత కంటే తక్కువ ఉండాలి. లోన్ కూడా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి తీసుకుంటేనే ఇది వర్తిస్తుంది.

ఇది ఇలా ఉండగా ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 24 కింద రూ.2 లక్షలు, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు కాకుండా మరో బెనిఫిట్ కూడా లభిస్తోంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈఈ కింద మొదటి సారి ఇల్లు కొంటె రూ.50 వేల పన్ను మినహాయింపు పొందొచ్చు. జాయింట్ లోన్ తీసుకుంటే ఇద్దరూ హోమ్ లోన్ వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news