సుభాష్ చంద్రబోస్.. భారత స్వాతంత్ర్య సమరయోధుడు.. అశేష భారతావని ప్రజల గుండెల్లో స్వాతంత్ర్య కాంక్ష రగిలించినవాడు. హిందు ఫౌజ్ స్థాపించి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి చరమగీతం పాడాలని పాటు పడ్డవాడు. భారత ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడై వెలిగినవాడు. అందరూ ముద్దుగా నేతాజీ అని పిలుచుకునేవాడు. ఆయన పుట్టినరోజు నేడు. 1897 జనవరి 23వ తేదీన జన్మించిన సుభాష్ చంద్రబోస్, భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొని భారత ప్రజల గుండెల్లో స్వేఛ్చని నింపాలని తపించినవాడు.
కటక్లో జన్మించిన సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ ఆశయాలతో నేషనల్ కాంగ్రెస్ లో 1920లో చేరాడు. 1938లో నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసాడు. ఐతే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అధ్యక్షుడిగా తానే తప్పుకున్నాడు. ఆయన మరణం గురించి ఎవ్వరికీ తెలియదు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో శ్రమించిన నేతాజీ మరణంపై ఎన్నో ప్రచారాలు ఉన్నాయి. అందులో నిజం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నేతాజీ చెప్పిన మాటలని స్మరించుకుందాం.
స్వేఛ్ఛ అనేది ఎవరో ఇచ్చేది కాదు, మనం తీసుకునేది.
నాకు రక్తాన్ని ఇవ్వండి. మీకు స్వాతంత్ర్యం ఇస్తాను.
దేశం మీద మీకున్న ఆశని ఎప్పటికీ వదులుకోకండి. ఈ భూమ్మీద ఉన్నదేదీ మనకి స్వేచ్చ లేకుండ చేయలేవు.
ఒక ఆలోచన కోసం ఒకరు చచ్చిపోవచ్చు. కానీ ఆ ఆలోచన వేలమందిలో చలనం కలిగిస్తుంది.
మన స్వాతంత్ర్యం కోసం పనిచేయడం మన విధి.
చర్చల ద్వారా మార్పు వచ్చినట్టు చరిత్రలో ఎక్కడా కనబడలేదు.
మీకేదైనా కావాలనుకున్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఇవ్వడానికి రెడీగా ఉండండి.