ఈ బ్యాంక్ ఇచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?

కస్టమర్ల కోసం ప్రైవేటు రంగ బ్యాంకులు బాగా అప్డేట్ అవుతూ కస్టమర్లకు ప్రయోజనం కలిగేలా
కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఈ క్రమం లోనే ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ కూడా సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేమిటంటే..? కొత్త సంవత్సరం గిఫ్ట్ అందించడమే. ఆ గిఫ్ట్ ఏమిటనే విషయం లోకి వస్తే… ఇటీవల తమ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ లపై వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

IDFC First bank
IDFC First bank

ఆ వివరాలని చూస్తే.. ఇక నుండి సేవింగ్స్ అకౌంట్ కలిగిన కస్టమర్స్ అందరికి కూడా ఎక్కువ వడ్డీ లభించనుంది. ఈ సరికొత్త నిర్ణయం జనవరి 1 నుంచి అమలు లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. ఒకవేళ కనుక ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్ లో లక్ష రూపాయల వరకు బాలన్స్ ఉన్నట్టు అయితే ఇక పై 7 శాతం వరకు వడ్డీ లభిస్తుందని బ్యాంకు తమ కస్టమర్ల కి తీపి కబురు చెప్పింది. అదే పాత పధ్ధతి లో అయితే కేవలం ఈ బ్యాలెన్స్ కలిగిన అకౌంట్ పై కేవలం ఆరు శాతం మాత్రమే వడ్డీ రేటు వచ్చేది.

ఇది ఇలా ఉండగా ఇతర బ్యాంకులని పోల్చి చూస్తే కనుక ఈ బ్యాంకు అందిస్తున్న వడ్డీ రేటు రెట్టింపు అని మనం చెప్పొచ్చు. ఒక వేళ మీరు కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తే ఆన్లైన్లోనే అకౌంట్ తెరిచేందుకు అవకాశం ఉంటుంది. కేవలం https://www.idfcfirstbank.com ఈ లింక్ ఓపెన్ చేసి సులువుగా ఇంట్లో ఉండే ఎకౌంట్ ని ఓపెన్ చేసేసుకోవచ్చు.