గుడ్ న్యూస్‌.. హెల్మెట్ ధరిస్తే ఇక నో చెకింగ్

-

ప్ర‌స్తుత రోజుల్లో హెల్మెట్ లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంచి ప్రాణాలు కోల్పోతున్నారు. మన ప్రాణాలకోసం బైక్ లో పోయేవారిని హెల్మెట్ పెట్టుకోమని పోలీసులు ఎంత మొత్తుకున్నా మనం వినం. వాస్త‌వానికి ద్విచక్రవాహన, కారు ప్రమాదాలలో మరణాలకి ఎక్కువ శాతం కారణం హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లనే. వెయ్యి వరకు జరిమానాలు విధిస్తున్నా హెల్మెట్‌ వినియోగంపై ద్విచక్రవాహనదారులు నిర్లక్ష్యం వీడడం లేదు. అయితే తాజాగా ద్విచక్ర వాహనదారులకు పోలీసు ఉన్నతాధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

హెల్మెట్ ధరించి బైక్ నడిపితే ఇతర పత్రాల కోసం వారిని తనిఖి చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. దీనివల్ల హెల్మెట్ వాడకం పెరిగే అవకాశాలు ఉన్నాయని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. వాహనదారులను తదుపరి ఆదేశాల వరకు తనిఖీల నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.

ఇక హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మాత్రం ఉరుకోవద్దని వారికి జరిమానా విధిస్తునే వాహనానికి సంబంధించిన ధృవపత్రాలను చెకింగ్ చేయాలనీ పోలీస్ అధికారులకు ఆదేశించారు. బైక్ యాక్సిడెంట్ లో మేజర్ మరణాలు హెడ్ ఇంజ్యూరీ వల్లే జరుగుతున్నాయని, హెల్మెంట్ ధ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ప్రాణాలు కోల్పోయే అవ‌కాశం ఉంది. అందుకే ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌ హెల్మెట్ ధరించాలని వాహనదారులను ప్రోత్సాహిస్తున్నామ‌న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version