ఇక వాట్సాప్ ద్వారా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ బుకింగ్.. ఎలాగంటే..?

ఎల్‌పీజీ వినియోగ‌దారులకు ఇండేన్ గ్యాస్ కంపెనీ శుభ‌వార్త చెప్పింది. ఇప్ప‌టికే ఆ కంపెనీ ప‌లు విధానాల్లో గ్యాస్ సిలిండ‌ర్ల‌ను బుక్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇండేన్ కంపెనీ ఇప్పుడు త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు వాట్సాప్ ద్వారా కూడా సేవ‌లు అందిస్తోంది. ఇక‌పై వినియోగ‌దారులు వాట్సాప్ ద్వారా కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్‌ను బుక్ చేసుకోవ‌చ్చు. అది ఎలాగంటే..

now you can book lpg cylinder through whatsapp

ఇండేన్ గ్యాస్ వినియోగ‌దారులు 7718955555 అనే నంబ‌ర్‌కు కాల్ చేసి ఎల్‌పీజీ సిలిండ‌ర్‌ను బుక్ చేయ‌వ‌చ్చు. ఇక 7588888824 నంబ‌ర్‌కు వారు వాట్సాప్ ద్వారా సిలిండ‌ర్ రీఫిల్ ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. అయితే క‌స్ట‌మ‌ర్లు గ్యాస్ కంపెనీలో రిజిస్ట‌ర్ అయి ఉన్న వాట్సాప్ ఫోన్ నంబ‌ర్‌ను మాత్ర‌మే ఈ సేవ కోసం ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఆ నంబ‌ర్‌తో వాట్సాప్‌లో 7588888824 అనే నంబ‌ర్‌కు REFILL అని టైప్ చేసి మెసేజ్ చేయాలి. దీంతో సిలిండ‌ర్ బుక్ అవుతుంది. కేవ‌లం రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబర్ ద్వారానే ఈ ర‌కంగా గ్యాస్ సిలిండ‌ర్ బుకింగ్ సాధ్య‌ప‌డుతుంది.

ఇక ఇండేన్ క‌స్ట‌మ‌ర్లు గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూట‌ర్ కు ఫోన్ చేయ‌డం ద్వారా, కంపెనీకి చెందిన వెబ్‌సైట్ ద్వారా, యాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండ‌ర్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు. ఇక గ్యాస్ సిలిండ‌ర్ డెలివ‌రీ స‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్లు ఓటీపీ చెబితేనే సిలిండ‌ర్‌ను డెలివ‌రీ చేస్తారు.