పేటీఎం వ్యాలెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జొమాటో, స్విగ్గీ, ఫాసూస్, ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా… లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంటికే ఫుడ్ డెలివరీ అవుతుంది. ఇప్పుడు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ లో జొమాటో ముందంజలో ఉంది. అది ఇంకో అడుగు ముందుకేస్తూ.. పేటీఎంతో జత కలిసింది.
పేటీఎం, జొమాటోలు రెండూ చేతులు కలపడంతో… పేటీఎం యాప్ ద్వారానే ఫుడ్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేవలను విస్తరించనున్నట్టు పేటీఎం ప్రకటించింది. ఈనెల చివరి వరకు దేశంలోని వంద నగరాల్లో దాదాపు 80 వేల రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ చేసేలా యాప్ ను డెవలప్ చేస్తున్నట్టు పేటీఎం తెలిపింది. సాధారణంగా జొమాటోలో వచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ దీనికి కూడా వర్తించనున్నట్టు పేటీఎం ప్రకటించింది. ప్రారంభ ఆఫర్ గా 100 రూపాయకు వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది పేటీఎం.