ఆ మెసేజ్‌లను అస్సలు క్లిక్‌ చేయొద్దు: పోలీసులు

-

వాట్సాప్‌ యూజర్‌లకు పోలీసులు హెచ్చరిక చేస్తున్నారు. అదే ఇటీవల ఫేక్‌ మెసేజ్‌ల షేరింగ్‌ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి హ్యాకర్ల ఉచ్చుల్లో పడకూడదని సూచిస్తున్నారు. ఈ లింక్‌పై క్లిక్‌ చేస్తే గిఫ్ట్‌లు వస్తాయి..ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ అంటూ వాట్సాప్‌ వినియోగదారులకు మెసేజ్‌లు వస్తున్నాయి. అయితే,ఆ మెసేజ్‌ లపై అస్సలు క్లిక్‌ చేయొద్దు.. వాట్సాప్‌ వినియోగదారులకు సైబర్‌ పోలీసుల హెచ్చరిక చేస్తున్నారు.
ఫ్రీ సబ్‌ స్క్రిప్షన్‌ అంటూ వచ్చే లింకులపై క్లిక్‌ చేయొద్దని ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.


సైబర్‌ నేరగాళ్లు వివిధ రూపల్లో అమాయకులతో ఆడుకుంటున్నారు. ఫ్రీ అంటూ ఆశ చూపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. వారి టార్గెట్‌ కేవలం స్మార్ట్‌ ఫోన్‌ వాడే వారు మాత్రమే. ఫేక్‌ లింకులు పంపుతూ వారి వద్ద నుంచి బ్యాంకు తదితర సమాచారాన్ని తస్కరిస్తున్నారు. అనేక మంది ఇలాంటి ఫేక్‌ మెసేజ్‌ లను నమ్మడంతో పాటు వాటిని ఇతరులకు కూడా షేర్‌ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారుతున్నాయి. దీంతో బాధితులుగా సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో . అమెజాన్‌ ప్రైమ్, నెట్‌ ఫ్లిక్స్‌ తదితర వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌ లకు ఉచితంగా యాక్సెస్‌ అంటూ వచ్చే మెసేజ్‌ లను నమ్మ వద్దని సూచించారు.

ఇలాంటి లింకులు మీ స్మార్ట్‌ ఫోన్లోని విలువైన డేటాను చోరీ చేస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి మెసేజ్‌ లు ఏమైనా వస్తే వాటిపై క్లిక్‌ చేయవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్‌ కూడా చేయవద్దని స్పష్టం చేశారు.”Get 2 months of Amazon Premium Free anywhere in the world for 60 days. http://profilelist.xyz/?livestream”

ఈ లింక్‌ లపై క్లిక్‌ చేస్తే మనకు తెలియకుండానే మన స్మార్ట్‌ ఫోన్లోని బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరుతుందని తెలిపారు. క్రెడిట్‌ కార్డు వివరాలు, పాస్వర్డ్‌ లు, మెసేజ్‌ లు, ఫొటోలు కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని స్పష్టం చేశారు. వాట్సాప్‌ వినియోగదారలు ఇలాంటి మెసేజ్‌ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news