సింగర్ సిద్ శ్రీరామ్.. ఒక్క పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా..?

ఈ మధ్య కాలంలో యువతని ఉర్రూతలూగిస్తున్న గాయకుడు సిద్ శ్రీరామ్. విభిన్నమైన గాత్రంతో తనదైన టాలెంట్ తో సంగీత ప్రియులందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. సిద్ శ్రీరామ్ ఏ పాట పాడినా అదొక హిట్ గా నిలుస్తుంది. సినిమా ఎలా ఉన్నా సిద్ శ్రీరామ్ పాడాడంటే దానికి వచ్చే క్రేజే వేరు. అందుకే సిద్ తో పాట పాడించడానికి దర్శక నిర్మాతలందరూ ఉర్రూతలూగుతుంటారు. ఐతే సిద్ శ్రీరామ్ వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట.

ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, సిద్ శ్రీరామ్ పనితీరు ఎలా ఉంటుందనేది వివరించాడు. సిద్ శ్రీరామ్ వారానికి ఒక్క పాట మాత్రమే పాడతాడట. అది కూడా తనకి బాగా నచ్చిందనిపిస్తేనే గళం విప్పుతాడట. తన దారిలోకి వచ్చే ప్రతీదీ పాడకుండా, తనకు నచ్చే పాటలకు మాత్రమే గొంతుతో ప్రాణం పోస్తాడట. ఒక్క పాటకి 4లక్షల దాకా తీసుకుంటాడని, ఆమాత్రం పారితోషికం సరైనదే అని చెప్పుకొచ్చాడు.