పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..డబ్బు రెట్టింపు చేసుకోండిలా..

మీ దగ్గర ఉన్న డబ్బును రెట్టింపు చేసుకోవాలని ఆలోచన చేసేవారికి, ఇప్పుడు మీకోసం అలాంటి ఒక అదిరిపోయే ప్లాన్ అందుబాటులో ఉంది. పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్‌లో డబ్బులు పెట్టడం వల్ల కచ్చితమైన రాబడితో పాటు మీ డబ్బును రెట్టింపు కూడా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఎక్కువ డబ్బు సంపాదించాలని అందరూ కోరుకుంటారు. కోటీశ్వరులు కావాలని ఆశ పడతారు. కానీ, అందరికీ ఇది సాధ్యం కాదు.ఇదే కాకుండా కొంత మంది డబ్బు సంపాదించినా దాన్ని పెద్దగా దాచుకోలేరు. మొత్తం ఖర్చు చేసేస్తారు. కొంత మంది మాత్రం చేతిలో ఉన్న డబ్బుతోనే మళ్లీ డబ్బు సంపాదించాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం ఇప్పుడు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించి పోస్టాఫీస్ మీ చేతిలోని డబ్బును రెట్టింపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పోస్టాఫీస్‌లో పలు రకాల సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో కిసాన్ వికాస్ పత్ర (KVP ) అనే ఒక స్కీం ఉంది. ఈ పథకంలో డబ్బులు పెట్టడం వల్ల మంచి రాబడి పొందుతూ, మీ డబ్బును రెట్టింపు కూడా చేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన లాభం పొందచ్చు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో మీరు డబ్బులు పెట్టడం వల్ల 124 నెలల్లోనే మీ పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం ఇందుకు వడ్డీ రేటు 6.9 శాతం ఉంది. ఉదాహరణకి మీరు ఈ స్కీమ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ.2 లక్షలు పొందొచ్చు. అదే రూ. 2 లక్షలు పెడితే.. రూ. 4 లక్షలు పొందొచ్చు.

పోస్టాఫీస్ కేవీపీ స్కీమ్ లో నామిని సదుపాయం కూడా ఉంది. అలాగే మీరు ఈ డబ్బును ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. అంటే మీ స్కీమ్‌లోని డబ్బులను ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు వయసు దాటిన ఎవరైనా సరే ఈ స్కీమ్ ‌లో జాయిన్ అవచ్చు.