పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు షాక్…! భారీ ఛార్జీలు…!

-

మీకు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా వుందా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పోస్ట్ ఆఫీస్ తమ ఖాతాదారులకు లేటెస్ట్ గా షాక్ ఇచ్చింది. డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడం పై ఛార్జీలు విధించనున్నట్లు పోస్ట్ ఆఫీస్ తెలిపింది. అయితే ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి రానున్నట్లు వెల్లడించింది.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఒకవేళ కనుక పోస్ట్ ఆఫీస్ కస్టమర్స్ నెల కి నాలుగు సార్ల వరకు నగదును విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి చార్జీలు ఉండవు. ఒకవేళ కస్టమర్స్ కనుక అంత కంటే ఎక్కువ సార్లు విత్ డ్రా చేసారు అంటే కనుక ప్రతీ ట్రాన్సాక్షన్ కు రూ. 25 వరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

అదే కస్టమర్స్ కి కనుక బేసిక్ సేవింగ్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ ఉంటే ప్రతీ నెలా రూ.25వేల వరకు ఉచితంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. అలానే వాళ్ళు నెలకు రూ.10 వేల వరకు ఉచితంగా డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ ఆ లిమిట్ కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ప్రతీ ట్రాన్సాక్షన్ కు రూ. 25 వరకు చెల్లించాల్సి ఉంటుంది. పోస్టు పేమెంట్‌ నెట్‌వర్క్ ‌లో లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించుకో వచ్చు. అలానే పోస్టాఫీసుల్లో మినీ స్టేట్ మెంట్ కనుక తీసుకున్నారంటే రూ. 5 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news