రేవంత్ ని వద్దన్నా… కాంగ్రెస్ ఆగట్లేదుగా…? మరో సంచలన నిర్ణయం…!

-

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వం విషయంలో కాస్త కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుందనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. రేవంత్ రెడ్డి కొన్ని కొన్ని అంశాల్లో దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం ఎవరి అభిప్రాయాలను కూడా తీసుకోకుండా ముందుకు వెళ్ళడం వంటివి చేస్తూ ఉంటారు. దీనితో రేవంత్ రెడ్డిని చాలామంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

అందుకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు పార్టీ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణలో 12మందితో ఒక కొత్త టీంని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెడీ అయింది. అసలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది… నియోజకవర్గం సీనియర్ నేతలు ఎంత వరకు పనిచేస్తున్నారు… మాజీమంత్రులు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నారు… ఎమ్మెల్యేలు ఎంత వరకు కృషి చేస్తున్నారు అనే అంశాలను ఇప్పుడు ఈ కమిటీ ద్వారా రా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ కమిటీకి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. కొండా సురేఖ సహా దాదాపు మహిళా నేతలు ఈ కమిటీలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ తో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు అంటకాగుతున్నారు అనే విషయం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ద్వారా స్పష్టంగా అర్థమైంది. కచ్చితంగా గెలిచే నియోజకవర్గం అయినా టిఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. అందుకే ఇప్పుడు తెలంగాణలో పార్టీ ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news