వాటే స్కీమ్: రూ.10 వేలతో చేతికి రూ.16 లక్షలు…!

Join Our Community
follow manalokam on social media

మీ దగ్గర ఉన్న డబ్బుని ఎందులోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా…? ఆయితే మీకు ఇది గుడ్ న్యూస్. పోస్టాఫీస్ ఆర్‌డీ అకౌంట్ ‌లో డిపాజిట్ చేసుకుని లాభం కూడా పొందొచ్చు. ఇందులో చాల ఆప్షన్లు అందుబాటు లో ఉంటాయి కూడా. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తి వివరాలని ఇప్పుడే చూసేయండి. పోస్టాఫీస్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఆయితే వాటిలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఒక భాగమనే అనొచ్చు. ఆయితే మంచి బెనిఫిట్స్ కూడా మీరు పొందవచ్చు.

పోస్టాఫీస్ అందించే పలు స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్ ఉండదు. పైగా మంచి రాబడి పొందొచ్చు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చెయ్యాలంటే నెలకు రూ.100 నుంచి కూడా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. పైగా గరిష్ట పరిమితి ఏమి లేదు. ఈ ఆర్‌డీ అకౌంట్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు.కనుక దీనిలో మీరు ఐదేళ్ల వరకు డబ్బులు డిపాజిట్ చెయ్యాలి. కావలి అనుకుంటే మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.

ఇప్పుడు ఆర్‌డీ అకౌంట్‌పై 5.8 శాతం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చుతూ ఉంటుంది. ఇందులో కనుక మీరు ప్రతి నెలా రూ.10 వేలు డిపాజిట్ చేసారంటే పదేళ్లలో రూ.16 లక్షలకు పైగా లభిస్తాయి. నాలుగు నెలలు ఇందులో డబ్బులు కట్టలేదు అంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది. డబ్బులు కట్టి అకౌంట్ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. అదే ఒక నెల కట్టలేదు అంటే పెనాల్టీ పడుతుంది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....