ఇందులో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ లేకుండా రెట్టింపు డబ్బులు వస్తాయి…!

Join Our Community
follow manalokam on social media

మీరు మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే దీని కోసం చూడాల్సిందే..! పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. చేతిలో డబ్బులు పోస్టాఫీస్ ‌లో పెడితే అదిరిపోయే లాభం మీకు వస్తుంది. మీరు కనక రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు వస్తాయి. అంటే డబుల్ వస్తున్నాయి. మరి దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… పోస్టాఫీస్ పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందిస్తున్న సంగతి తెలిసినదే.

అయితే వాటిలో కిసాన్ వికాస్ పత్ర అనే పథకం కూడా ఒకటి. ఇందులో కనక మీరు ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు డబ్బులు పొందొచ్చు. దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే ఇది సూపర్ స్కీమ్‌. దీనిలో మీకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకి ఒకసారి ఈ వడ్డీ రేట్లు మారతాయి. కేంద్ర ప్రభుత్వం త్రైమాసికం చొప్పున వీటిని పరిశీలించడం జరుగుతుంది. దీనితో మారవచ్చు లేదా అలానే ఉండవచ్చు.

ఈ స్కీమ్ ‌లో ఇన్వెస్ట్ చేస్తే 124 నెలల్లో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. కనీసం 18 ఏళ్ల వయసు కలిగిన వారు ఇందులో చేరడానికి అర్హులు. కనీసం రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. మీరు కనుక రూ.లక్ష పెడితే మెచ్యూరిటీ సమయం లో చేతికి రూ.2 లక్షలు వస్తాయి.

 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....