కరోనా మహమ్మారి కారణంగా రైళ్లని నిలిపివేసిన సంగతి తెలిసినదే. అయితే కరోనా తగ్గుముఖం పట్టడం తో క్రమంగా క్రమంగా తన సర్వీసుల్లో మార్పులు చేయడం, అదనపు సర్వీసులు కల్పించడం వంటివి చేస్తోంది రైల్వే శాఖ. తాజాగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు-కాచిగూడ-గుంటూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏప్రిల్ 1 నుంచి పట్టాలు ఎక్కించనున్నారు.
దీనితో ప్రయాణికులకు ఊరట కలగనుంది. ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి తెస్తున్నారు. ఈ రైలు వివరాలని చూస్తే… ఏప్రిల్ 1 న రాత్రి 7 గంటలకు గుంటూరులో ఇది స్టార్ట్ అయ్యి నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, డోన్, కర్నూల్ సిటీ, జోగులాంబ గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ మీద నుండి మర్నాడు ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు చేరుతుంది.
ఆ తరువాత ఏప్రిల్ 2 న కాచిగూడ లో మధ్యాహ్నం 3.10 గంటలకు స్టార్ట్ అయ్యి… షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తిరోడ్, జోగులాంబ గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ, నరసరావుపేట మీదుగా తరువాత రోజు ఉదయం 6.45కి గుంటూరు వెళ్తుంది. దీనితో ప్రయాణికులకు ప్రయాణం ఈజీ అవుతుంది. అనేక మంది ఈ ప్యాసింజర్ రైళ్లు ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నారు. కానీ అన్ని ట్రైన్స్ ఎప్పుడు వస్తాయి అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి 65 శాతం రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.