ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది మంత్రులు తెలుగుదేశం పార్టీని విమర్శించే విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు చాలావరకు సైలెంట్ గా ఉంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయసాయిరెడ్డి మినహా ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మంత్రి కన్నబాబు అలాగే మరో మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పెద్దగా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
అలాగే విశాఖ ఎంపీగా ఉన్న ఎంవివీ సత్యనారాయణ కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడు భారతీయ జనతాపార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కాస్త స్పీడ్ గా వెళ్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని అంశాల్లో రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
అలాగే తెలుగుదేశం పార్టీని విమర్శించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. ఎప్పుడైనా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం మినహా పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు చేయడం లేదు అనే విషయం అర్థమవుతుంది. దీనితో జరిగే నష్టాన్ని అంచనా వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీళ్లకు క్లాస్ తీసుకోవాలని భావిస్తున్నారు. నేరుగా తానే విశాఖ వెళ్లి అక్కడి నేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.