24 గంటలూ అందుబాటులో రేషన్ ఏటీఎంలు…. వివరాలు ఇవే…!

-

ఇప్పుడు తాజాగా కొత్త సేవలు వచ్చాయి. రేషన్ కార్డు కలిగిన వాళ్ళ కోసం రేషన్ ఏటీఎంలు రాబోతున్నాయి. దీని వలన రేషన్ చాల ఈజీగా తెచ్చుకోవచ్చు. పైగా మీరు మీకు నచ్చినప్పుడు వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవచ్చు. దీనితో చాల మందికి ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం రేషన్ సరుకులను మెషీన్ల ద్వారా అందించేందుకు సిద్ధం అవుతోంది.

దీనితో ఈజీగా రేషన్ ని ఇళ్ళకి తీసుకెళ్లొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వీటిపై మంచి స్పందన కూడా వచ్చింది. అందుకే కేంద్ర ప్రభుత్వం మెషీన్ల ద్వారా రేషన్ సరుకులను అందించే ఈ సేవలని ఇతర రాష్ట్రాల లో కూడా మొదలు పెట్టాలని అనుకుంటోంది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుల కింద మెషీన్ల ద్వారానే రేషన్ సరుకులు అందిస్తున్నారు. కర్నాటక, హరియాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, మహరాష్ట్రల లో ఈ ప్రాజెక్టు అవుతోంది.

అలానే ఢిల్లీ, గుజరాత్‌ లో కూడా వీటిని తీసుకు రానున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మెషీన్ల దగ్గరకు వెళ్లి వారి కోటాను ఇంటికి తీసుకు రావచ్చు. బయోమెట్రిక్స్ ద్వారా మీ ఐడెంటిటీని మెషీన్ గుర్తించాక మీకు రావాల్సిన సరుకులు మీకు అందిస్తుంది. 24 గంటలలో వీటిని ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఇలా రేషన్ తీసుకునే వారికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తారు. దీనితో ఈజీగా తెచ్చుకో వచ్చు. గంటల తరబడి లైన్ల లో నిలబడక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news