స్మార్ట్ ఫోన్ లవర్స్… రియల్ మీ2 వచ్చేసింది.. ధర 8990 రూపాయలే!

-

స్మార్ట్ ఫోన్ లవర్స్.. వచ్చేసింది. మీ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. రెడ్ మీ ఫోన్ ను తలదన్నేలా చైనాకు చెందిన రియల్ మీ కంపెనీ రియల్ మీ2 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన రియల్ మీ1 ఫోన్ విపరీతంగా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే కదా. దీంతో రియల్ మీ కంపెనీ ఇప్పుడు తన రెండో మోడల్ ను తీసుకొచ్చింది. రియల్ మీ 1 ను తలదన్నేలా ఈ మోడల్ ను రియల్ మీ మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

నోచ్ డిస్ ప్లేతో పాటు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి అధునాతన ఫీచర్స్ ఈ మోడల్ కు ప్లస్ పాయింట్. 3 జీబీ వేరియంట్ మోడల్ ధర 8990 రూపాయలు కాగా.. 4 జీబీ వేరియంట్ ధర 10,990గా నిర్ణయించింది. సెప్టెంబర్ నాలుగో తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్టులో ఈ మొబైల్ తొలి సేల్ ప్రారంభమవుతుంది.

4230 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాక్అప్, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగా పిక్సెల్, 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓఎస్, 6.21 ఇంచుల నోచ్ ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 450 ఎస్ఓసీ ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ రియల్ మీ2 లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version