SBI అదిరిపోయే ఆఫ‌ర్‌.. కేవ‌లం వారం రోజులే గ‌డువు..!

-

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్‌. ఎందుకంటే హోటల్ రూమ్స్ బుక్ చేసుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇప్పుడో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఎస్‌బీఐ ఖాతాదారులకు 35 శాతం ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. అంతే కాదండి మరో 10 శాతం అదనంగా క్యాష్‌బ్యాక్ ను అందిస్తుంది. ఓయో రూమ్స్ ను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి బుక్ చేసుకున్న వారికి మాత్రమె ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎస్‌బీఐ సంస్థ స్పష్టం చేసింది.

హైదరాబాద్ లో మాత్రమే కాదు ఏ ప్రాంతంలోనైనా హోటల్ బుకింగ్స్‌ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ను పొందాలనుకునేవారు కనీసం రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ వ్యాల్యు కలిగి ఉండాలి. ఇక‌ ఈ ఆఫర్ కేవలం మరో వారం రోజులు అంటే నవంబర్ 10వ తేదిన ఈ ఆఫర్ ముగుస్తుందని ప్రకటించింది. మరింకెందుకు ఆలస్యం హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలనుకున్నవారు, ఈ ఆఫర్ను పొందాలనుకునే ఎస్‌బీఐ కస్టమర్లు OYOYONO ప్రోమో కోడ్ ను ఉపయోగించాలి.

Read more RELATED
Recommended to you

Latest news