ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‌గా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాలో ఆమె ఆరబోసిన అందాలకు ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ఒక్క సినిమాతోనే ఆమె ఓవర్‌నైట్ స్టార్ గ్లామర్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమాతో ఆమె ఎన్ని సంచలనాలు రేపిందో తెలిసిందే. ఆర్ఎస్స్ 100లో పాయల్ అందాలు కుర్ర కారు హృదయాల్లో మంటలు పుట్టించాయి. ఆ సినిమా మరవకముందే పాయల్ ఆర్డీ ఎక్స్ లవ్ అంటూ మరో హాట్ సినిమా చేసింది.
రెండో సినిమాలో కూడా ఆమె పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసింది. రెండో సినిమాలోనూ మరీ విపరీతమైన బోల్డ్‌నెస్‌తో రెచ్చిపోయినా ఆ సినిమా సరిగా ఆడలేదు. ఈ రెండు సినిమాల తర్వాత ఆమెపై బోల్డ్ హీరోయిన్ ముద్ర పడిపోవడంతో ఇప్పుడు ఆమెకు అన్నీ అలాంటి అవకాశాలే వస్తున్నాయట.
ప్రస్తుతం రవితేజ సరసన డిస్కో రాజా, వెంకటేష్, నాగ చైతన్య వెంకీ మామ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి ప్రస్తుతం వరుసగా బోల్డ్ కథలే వస్తున్నాయట. వరుసగా బోల్డ్ కథలతో సినిమాలు చేస్తుండడంతో పాయల్ స్పందిస్తూ బాబోయ్ నాకు అన్ని బెడ్ రూమ్ కథలే వస్తున్నాయని… అన్నీ ఏ సర్టిఫికెట్ సినిమాలేనా అంటూ వాపోయింది.
డిస్కో రాజా, వెంకీ మామ సినిమాలు రిలీజ్ అయితే కాని పాయల్‌కు ఏ టైప్ సినిమాలు వస్తాయో ? తెలీదు. ఏదేమైనా పాయల్‌కు పాపం వచ్చీ రావడంతోనే బోల్డ్ ఇమేజ్ రావడం, బోల్డ్ హీరోయిన్ అన్న ముద్ర పడిపోవడంతో ఇప్పుడు ఆమె ఆ ఇమేజ్ నుంచి లాక్కోలేక.. పీక్కోలేక నానా తిప్పలు పడుతోంది.