టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతికి మూడు నాలుగు భారీ అంచనాలున్న సినిమాలు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ మామూలుగా హీటెక్కడం లేదు. ఈఏ సినిమాల్లో ఇద్దరు అగ్ర హీరోలు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో ఒకే రోజు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోలు పంతానికి పోవడంతో చివరకు జనవరి 12న తమ తమ సినిమాలు రిలీజ్ చేయక తప్పడం లేదు. ఈ రెండు సినిమాలకూ పోటీగా సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ కూడా వస్తోంది.
దర్బార్‌కు మురుగదాస్ దర్శకుడు కావడంతో ఆ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా లాంటి సినిమాలు కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఇక ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మహేష్, బన్నీ సినిమాలు ప్రి రిలీజ్ బిజినెస్‌లో దూసుకు పోతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా చూస్తే మహేష్ బన్నీ కంటే దూసుకుపోతున్నాడు.
కీలకమైన నైజాంలో మహేష్ సినిమాను రు.25 కోట్లకు అమ్మారట. ఇక బన్నీ సినిమా అల వైకుంఠపురంలోకు నైజాం వరకు రు.20 కోట్లు వచ్చాయట. అంటే ఈ ఒక్క ఏరియాలోనే మహేష్ సినిమాకు రు. 5 కోట్లు ఎక్కువుగా వచ్చాయి. ఇక ఉత్తరాంధ్రతో పాటు కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ మహేష్ చాలా ముందున్నట్టు తెలుస్తోంది. మరి ఇద్దరికి భారీ టార్గెట్ తప్పదు.
అలాగే భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతుండడంతో పాటు ఒకే రోజు రిలీజ్ కావడంతో ఎవరికి దెబ్బ పడుతుందో ? అన్న సందేహాలు ఇండస్ట్రీలోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ ఉన్నాయి. ఇక భరత్అనే నేను, మహర్షి తర్వాత మహేష్ హ్యాట్రిక్ కోసం రెడీ అవుతుంటే.. మరోవైపు నాపేరుసూర్య లాంటి డిజాస్టర్ తర్వాత బన్నీ కాస్త టెన్షన్‌తో ఈ సినిమా చేశాడు.