కారు కొనాలనుకునే వారికి ఎస్బీఐ తీపికబురు…!

Join Our Community
follow manalokam on social media

ఎప్పటి నుండో కారు కొనాలని అనుకున్నా కుదరలేదా..? అయితే ఇదే మీకు మంచి అవకాశం. తాజాగా కారు కొనాలనుకునే వారికి ఎస్బీఐ తీపికబురు చెప్పింది. మరి ఆలస్యం ఎందుకు వివరాలని ఇప్పుడే తెలుసుకోండి. దీనితో మీరు సులువుగా కారుని పొందొచ్చు. వివరాల లోకి వెళితే… ఎస్‌బీఐ శుభవార్త. స్టేట్ బ్యాంక్ కస్టమర్ల కోసం అదిరిపోయే తీపికబురు అందించింది. కారుపై ఏకంగా మూడు రకాల బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తో కారు కొనాలనుకునే వాళ్లకి కాస్త ఊరట కూడా లభిస్తోంది.

స్టేట్ బ్యాంక్ టాటా సఫారీ కారు కొనాలని భావించే వారికి సూపర్ ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్ వివరాలని చూస్తే…. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కారు లోన్ తీసుకుంటే మంచి బెనిఫిట్ లభిస్తుంది. ఇలా చేస్తే వడ్డీ రేటు లో 0.25 శాతం తగ్గింపు లభిస్తుంది. పైగా ప్రాసెసింగ్ ఫీజు ఉండదు గమనించండి. అంతే కాదండి ఇంకా మరో బెనిఫిట్ కూడా ఉంది.

మీరు ఖచ్చితంగా కారు ధరకు సమానమైన మొత్తాన్ని లోన్ రూపంలో తీసుకోవడానికి వీలవుతుంది. దీని కోసం మీరు మీ డబ్బులు పెట్టాల్సిన పనే లేదు. చూసారా ఆఫర్ అదిరిపోయింది కదా…! ఈ విషయాన్ని ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. మీరు కొనుగోలు చెయ్యాలనుకుంటే యోనో యాప్‌ లో షాప్ అండ్ ఆర్డర్ ఆప్షన్‌ లోకి వెళ్లి కారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

 

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...