స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి శుభవార్త. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. అలానే ఎప్పటికప్పుడు ఆఫర్స్ వంటివి కూడా స్టేట్ బ్యాంక్ తీసుకు వస్తుంది. వీటి వలన కూడా స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ తమ డబ్బులని ఆదా చేసుకోచ్చు. ఇది ఇలా ఉంటే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుని చాలా మంది వాడతారు. మీకు కూడా స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందా..? అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై భారీ తగ్గింపుని పొందే అవకాశం వుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై తగ్గింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ కొద్దీ రోజులే. ఇక ఆఫర్ వివరాలని చూస్తే… మీరు కనుక ఈ క్రెడిట్ కార్డుతో ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తే రూ.7 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
ఈ అవకాశం అక్టోబర్ 23 వరకు మాత్రమే. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దిపావళి సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపుని పొందొచ్చు. గ్రాసరీ లో కనీసం రూ.2 వేల వరకు.. ఇతర ప్రొడక్టులలో కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ.5 వేలు ఉండాలి.
రూ.30 వేలు లేదా ఆపైన విలువైన ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే.. అదనంగా రూ.1500 తగ్గింపు పొందొచ్చు. రూ.80 వేలు లేదా ఆ పైన ట్రాన్సాకన్ నిర్వహిస్తే అదనంగా రూ.4 వేల తగ్గింపు పొందొచ్చు. అంటే మొత్తంగా రూ.7 వేల వరకు తగ్గింపు వస్తుంది.