స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ అదిరే లాభం పొందాలంటే ఎస్‌బీఐ SBI సేవింగ్ ప్లస్ అకౌంట్ పేరుతో ఓ కొత్త సర్వీస్ వచ్చింది. దీనితో అదిరే లాభాలు పొందొచ్చచు. పైగా ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
మాములుగా అయితే 2.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. కానీ ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ హోల్డర్లు సేవింగ్స్ బ్యాలెన్స్‌పై అధిక వడ్డీని పొందొచ్చు. సాధారణ అకౌంట్‌తో పోలిస్తే ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ ద్వారా వచ్చే లాభాలు ఎక్కువ. ఈ అకౌంట్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌కు లింక్ అయి ఉంటుంది.
ఒకవేళ మీకు ఆ డబ్బులు ఇప్పుడు అవసరం లేదు అని అనుకుంటే ఆ మొత్తానికి ఎక్కువ వడ్డీ పొందొచ్చు. ఇది ఇలా ఉంటే ఆ డబ్బులు ఆటోమెటిక్‌గా టర్మ్ డిపాజిట్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. వాటిని కావలసినప్పుడు తీసుకోవచ్చు.
అలానే ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్‌లో రూ.35,000 కన్నా ఎక్కువగా ఉన్న డబ్బులు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి వెళ్తాయి. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ లోకి కనీసం రూ.10,000 కట్టాలి. ఉదాహరణకు మీ అకౌంట్‌లో రూ.45,000 ఉంటే రూ.10,000, రూ.50,000 ఉంటే రూ.15,000 మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లో జమ అవుతాయి.
ఇలా దీనికి అధిక వడ్డీ పొందొచ్చు. అవసరమైన కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటే చాలు. వ్యక్తిగతంగా, జాయింట్‌గా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
దీని వలన సేవింగ్స్ అకౌంట్‌లో లభించే ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటి సేవలన్నీ ఉంటాయి. అదే విధంగా ప్రతీ ఏడాది 25 చెక్స్ ఉన్న చెక్ బుక్ ఉచితంగా పొందొచ్చు.