స్టేట్ బ్యాంక్: కూతురు వివాహ సమయానికి రూ. 25 లక్షలు.. పూర్తి వివరాలివే..!

-

కేంద్రం వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి చక్కటి లాభాలు కలుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం కుమార్తెల కోసం సుకన్య సమృద్ధి స్కీమ్ ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడం వలన అదిరే లాభాలని పొందొచ్చు.

ఇక పూర్తి వివరాలని చూస్తే.. కుమార్తె చదువు, ఆమె వివాహానికి మీరు రూ.15 లక్షలు పొందొచ్చు. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాలన్న కూడా ఈ స్కీమ్ మీకు తోడ్పడుతుంది. కూతురు చదువు కోసం కానీ ఆమె పెళ్లి కోసం కానీ భయపడక్కర్లేదు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సుకన్య సమృద్ధి స్కీమ్ ని ఓపెన్ చేసే అవకాశం ఇస్తోంది. 1.5 లక్షల వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఈ స్కీమ్ ని తెరిచి పెట్టచ్చు. ఇంత అమౌంట్ ని పెట్టలేకపోతే రూ.250 డిపాజిట్ చేస్తే చాలు. ఈ స్కీమ్ కోసం SBI ట్వీట్ చేసింది. దీనిలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందచ్చని చెప్పింది. 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్ కింద ఇద్దరు కుమార్తెలకు అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version