హైదరాబాద్ నుండి అండమాన్ టూర్.. ఈ ప్రదేశాలన్నీ చూడవచ్చు.. ధర కూడా తక్కువే..!

-

ఐఆర్‌సీటీసీ ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీలతో మనం ఈ ప్రదేశాలని చుట్టేసి వచ్చేయచ్చు. ఆహ్లదకర వాతావరణాన్ని పర్యటక ప్రదేశాల్లో గడపాలనుకునేవారికి ఈ ప్యాకేజీ బావుంటుంది. వివిధ పర్యాటక ప్రాంతాల ని ఈ ప్యాకేజీ ద్వారా చూసి వచ్చేయచ్చు. ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి అండమాన్ దీవులకు స్పెషల్ టూర్ ప్యాకెజీని తీసుకు రావడం జరిగింది. దాదాపు 3 వందల ద్వీపాలు, అందమైన బీచ్‌ల తో అండమాన్ ఎంతో బాగుంటుంది.

 

ఈ ప్యాకేజీ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక మరిన్ని వివరాలు చూస్తే.. ఆగస్టు 18న ఉదయం 4: 35 గంటలకు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కాలి. 9:15 గంటల సమయానికి పోర్ట్ బ్లెయిర్ వెళ్లారు. అక్కడ హోటల్‌ లో స్తే ఉంటుంది. సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని చూడవచ్చు. మీరు లైట్, సౌండ్ షోను కూడా చూడవచ్చు. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రికి డిన్నర్, స్టేయింగ్.

రెండో రోజు నార్త్ బే ఐలాండ్‌. మూడో రోజు హావలాక్ టూర్‌లో భాగంగా కలాపత్తార్, రాధానగర్ బీచ్‌లను చూడవచ్చు. నాల్గవ రోజు భరత పూర్ బీచ్, లక్ష్మాపూర్ బీచ్‌ల ని చూడవచ్చు. ఐదో రోజు ఉదయం క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కి వెళ్లారు. తర్వాత రెస్ట్, షాపింగ్. ఆరో ఉదయం 7:55 గంటలకు ఫైట్ ఎక్కితే మధ్యాహ్నం 12:10 గంటలకు హైదరాబాద్ వచ్చేయచ్చు. సింగిల్ అక్యూపెన్సీ ధర రూ. 58440, డబుల్ అక్యూపెన్సీ ధర రూ.45830. అలానే ట్రిపుల్ అక్యూపెన్సీ రూ.45540. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version