ఈ స్కీమ్స్ లో చేరితే వెంటనే లోన్ వస్తుంది..!

-

మీకు ఆర్ధిక సమస్యలు ఎక్కువయ్యాయ..? ఏం చెయ్యాలో తోచడం లేదా..? బ్యాంక్స్ నుండి లోన్ తీసుకుని సమస్యల నుండి బయట పడాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఇవి తెలుసుకోవాలి. సులభంగా లోన్ పొందటానికి మీకు ఇక్కడ ఒక అవకాశం వుంది. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

money
money

ఈ రెండు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ లో చేరిన వారికి ఈజీగానే రుణం లభిస్తోంది. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. కిసాన్ వికాస్ పత్ర KVP, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ NSC వంటి పథకాల్లో చేరిన వారికి ఈజీగా లోన్ వస్తుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వీరికి రుణాలు అందిస్తోంది.

అయితే ఇక ఎంత వడ్డీ రేటు లభిస్తుంది అనేది చూస్తే.. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరితే 6.9 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. ఈ కాలంలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది.

ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అయితే 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది ఇలా ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఈ స్కీమ్‌ లో చేరిన వారికి వారి ఇన్వెస్ట్‌మెంట్ విలువలో 85 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో అందిస్తోంది. వడ్డీ రేటు 11.9 శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news