అదిరే LIC పాలిసీ…రూ. 29 తో రూ. 4 లక్షలు..!

-

చాలా మంది LIC లో డబ్బులు పెడుతూ వుంటారు. దీని వలన చక్కటి లాభాలను పొందొచ్చు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవిత బీమాను ప్లాన్‌ చేస్తుంటారు. సాలరీ లో కాస్త డబ్బులని సేవ్ చేస్తుంటారు. ఇలా చేయుటం వలన భవిష్యత్తు లో సమస్యలు కలగవు. అయితే ఎల్‌ఐసీ అందించే పాలసీల్లో ఆధార్‌ శిలా ప్లాన్‌ కూడా ఒకటి.

ఈ ప్లాన్‌ ని ప్రత్యేకంగా మహిళలు, అమ్మాయిల కోసమే తీసుకొచ్చారు. ఈ ప్లాన్ ని మీరు . 29 జమ చేస్తే రూ. 4 లక్షల వరకు వస్తాయి. ఇక మరి ఈ పాలసీ కి సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.. ఈ పాలసీ తీసుకుంటే మినిమం రిటర్న్‌ రూ. 75 వేలు గ్యారంటీగా వస్తాయి.

అయితే మాక్సిమం మాత్రం 3 లక్షలు దాటి ఉండదు. దీనిలో పాలసీదారుడు గరిష్టంగా రూ. 3 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ ప్రీమియం ని నెలవారీ, త్రైమాసిక, అర్థ వార్షిక లేదా వార్షిక వాయిదాల్లో చెల్లించేందుకు అవుతుంది. మెచ్యూరిటీ పీరియడ్‌ 1 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు వుంది. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసున్న మహిళలు ఈ పాలసీ ని తీసుకొవచ్చు.

ఒకవేళ కనుక పాలసీదారుడు మధ్యలో మరణిస్తే.. అప్పుడు కూడా డబ్బు వస్తుంది. రూ. 29 పెట్టుబడిగా పెడితే ఏడాదికి రూ. 10,959 ఈ పాలసీ ని కనుక 30 ఏళ్ల వయసులో తీసుకుంటే.. అప్పుడు 20 ఏళ్ల పాటు రోజుకు రూ.29 కడుతూ ఉంటే మొత్తం రూ. 2,14,696 పెట్టుబడిగా పెట్టినట్టు అవుతుంది. పాలసీ మెచ్యూరిటీ పీరియడ్‌ అయ్యాక మీకు అప్పుడు రూ. 3,97,000 వరకు రిటర్న్‌ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news