8 వేల పెట్టుబడి తో 5 లక్షల లాభం పొందే ఎల్‌ఐసీ సూపర్ పాలసీ..!!

భారత దేశంలో అతి పెద్ద లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ అందరికి అందుబాటులో ఉండే ఒక కొత్త పాలసీని తీసుకు వచ్చింది. ఈ పాలసీ ద్వారా ఎన్నో లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి.లాభాలను అందించే వాటిలో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మూడు వేర్వేరు నిబంధనలను ఎంచుకోవచ్చు. వాటి ప్రకారం ప్రీమియం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

LIC
LIC

 

ఇకపోతే ఈ ప్లాన్ కోసం కనీస వయస్సు 8 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 59 సంవత్సరాలు ఉండాలి. ఈ ప్లాన్‌లో కనీస హామీ రూ. 2 లక్షలు. గరిష్ట పరిమితి లేదు. ఇందులో 16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల ప్రకారం కాలపరిమితి ఉంటుంది. అయితే ఎంచుకున్న టర్మ్ ప్రకారం ప్రీమియం కనిష్ట సంవత్సరాలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 16 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే 10 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 21 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 25 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే16 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.

8 వేలు ఎల్‌ఐసీ లో పెట్టుబడి పెడితే..5 లక్షలు పొందే అవకాశం..

25 ఏళ్ల వయస్సులో ప్రారంభించాలి. అలాగే సమ్ అష్యూర్డ్ రూ. 20 లక్షలతో ఎంచుకోవాలి. కాలపరిమితి 25 సంవత్సరాలు తీసుకోవలసి ఉంటుంది. దీని కింద మొదటి ఏడాది ప్రీమియంగా రూ.93584 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో వచ్చే ఏడాది నుంచి రూ.91569 ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది.

టర్మ్‌ను 25 సంవత్సరాలు తీసుకుంటే ప్రీమియం 16 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి. 16 సంవత్సరాల తర్వాత ఎటువంటి ప్రీమియం కట్టనవసరం లేదు..ఆ తర్వాత పాలసీ తీసుకున్న వ్యక్తికి 50 సంవత్సరాల వచ్చే సరికి 52,50000 మొత్తాన్ని చివరికి పొందుతాడు..