EPFO శుభవార్త.. విత్ డ్రాయల్ రూల్స్ లో మార్పులు.. వడ్డీ కూడా పడుతుంది..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. పెన్షన్ విత్ డ్రాయల్ నిబంధనలను ఈపీఎఫ్ఓ మార్చింది. ఇక పూర్తి వివరాలను చూస్తే… రిటైర్ అయ్యే ముందు ఈపీఎఫ్ఓ సభ్యులు తమ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎస్-95లో డిపాజిట్ చేసిన డబ్బులను కూడా రిటైర్ అయ్యే దాని కంటే ముందే విత్ డ్రా చేసేయచ్చు. రిటైర్‌మెంట్‌కి ఆరు నెలలు ముందుగా ఈ డబ్బులను తీసుకోవచ్చు.

రూల్స్ లో వచ్చిన మార్పులు ఇవే:

సర్వీసులో ఉండేందుకు ఆరు నెలల కంటే తక్కువ సమయమున్న అకౌంట్ హోల్డర్లు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-1995(ఈపీఎస్-1995) నుంచి డ్రా చేసేందుకు పెర్మిషన్ ఇచ్చింది EPFO. పదవీ విరమణకు ముందు కేవలం ఈపీఎఫ్ఓ డబ్బులను మాత్రమే తీసుకోవడానికి అవుతుంది. ఈపీఎస్-95లో డబ్బులను పదవీ విరమణకు ముందే విత్ డ్రా చేసుకునే సౌకర్యం వుంది. ప్రొపార్షినేట్ పెన్షనరీ ప్రయోజనాలను 34 ఏళ్లకు పైబడి వున్నవారికి ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈపీఎఫ్ఓ 2021-22కు చెందిన వడ్డీని క్రెడిట్ చేసే ప్రాసెస్ ని సోమవారం నుండి స్టార్ట్ చేసారు. క్రెడిట్ అయిన ఈ వడ్డీ యూఏఎన్, ఈపీఎఫ్ఓ అకౌంట్లలో త్వరలోనే పడనుంది. నష్టం ఉండదని ఎంత వడ్డీ కలిగి ఉంటే ఆ మొత్తాన్ని ఇస్తున్నట్టు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news