ఉచిత హామీల విచారణకు త్రిసభ్య ధర్మాసనం : సుప్రీం కోర్టు

-

ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు హామీలిస్తూ ఉంటాయి. అయితే ఎన్నికల్లో గెలవడానికి ఇస్తున్న అపరిమిత ఉచిత హామీలను కట్టడి చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన రిఫరెన్స్‌ ఆర్డర్‌ ప్రకారం ఉచిత హామీల వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని సీజేఐ తెలిపారు.

ఆ ధర్మాసనం చేపట్టే కేసుల జాబితాలో చేర్చేలా ఆదేశాలిచ్చేందుకు గాను సంబంధిత రికార్డులన్నీ తన ముందుంచాలని జస్టిస్‌ యు.యు.లలిత్‌ సూచించారు. ప్రాధాన్యం గల అంశమైనందున సత్వరమే విచారణకు వచ్చేలా చూస్తామన్నారు. విశాల ప్రజాహితం దృష్ట్యా … నిర్హేతుకమైన ఉచిత హామీలు ఇవ్వకుండా నియంత్రణ విధించడం కోసం ఒక నిపుణుల కమిటీని నియమించాలని పిటిషనర్లలో ఒకరైన అశ్వినీ ఉపాధ్యాయ్‌ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news