రూ.2 డిపాజిట్ చేస్తే రూ.36 వేలు వస్తాయి…!

-

ఈ మధ్య కాలం లో చాలా రకాల స్కీమ్స్ మనకి అందుబాటులో వున్నాయి. ఈ స్కీమ్స్ వలన పెన్షన్ వస్తుంది. అయితే కేవలం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి మాత్రమే కాదు అసంఘటిత రంగంలోని వారికి కూడా కొన్ని స్కీమ్స్ వున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే స్కీమ్ ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మంధన్ యోజన.

ఈ స్కీమ్ వీధి వర్తకులు, రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కూలీలు, ఇతరులకు బాగా ఉపయోగ పడుతుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పదవీ విరమణ పొందిన తర్వాత ఈ పధకం కింద పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్‌లో కేవలం రోజుకు రూ.2 కనుక చెల్లిస్తే ఏడాదికి రూ.36 వేల పెన్షన్‌ను పొందవచ్చు. మీరు నెలకు రూ.55 డిపాజిట్ చేస్తే ఈ స్కీమ్ ని ప్రారంభం చెయ్యచ్చు.

18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి రోజుకు రూ.2 ఈ పథకంలో సేవ్ చేస్తే నెలకు రూ.36 వేల పెన్షన్‌ను పొందవచ్చు. 40 ఏళ్ల వయసులో వాళ్ళైతే నెలకు రూ.200 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌ని ప్రారంభించాలంటే మీ వయసు 18 ఏళ్ల కంటే తక్కువగా, 40 ఏళ్ల కంటే ఎక్కువగా వుండకూడదు.

ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నెలవారీ వేతనం రూ.10 వేల కంటే తక్కువగా ఉంటేనే అర్హులు. ఆధార్ కార్డు, సేవింగ్స్ లేదా జన్ ధన్ బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ సమయంలో అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news