యూనిఫైడ్ పెన్షన్ విధానంతో ఆర్థిక స్థిరత్వం.. సామాజిక భద్రత కూడా..!

-

ప్రధాని నరేంద్ర మోడీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని ప్రారంభించారు. భారతదేశంలో పెన్షన్ వ్యవస్థలపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడంలో ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. గతంలో ఉన్న పెన్షన్ పథకంలో లోపాలను సరి చేస్తూ పెన్షన్ దారులకు బెనిఫిట్ కలిగే విధంగా ఈ విధానాన్ని రూపొందించారు. యుపిఎస్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి..? ఇదివరకు వాటితో పోల్చుకుంటే దీని వలన ఉపయోగం ఏంటి అనే దాని గురించి చూద్దాం.. ఏకీకృత పెన్షన్ విధానం అనేది భారతదేశంలో బలమైన పెన్షన్ వ్యవస్థ కోసం పెరుగుతున్న డిమాండ్లకు రూపొందించిన ప్రతిస్పందన అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ కోరుతున్న పాత పెన్షన్ స్కీంలా కాకుండా యుపిఎస్ ఆర్థిక విపత్తుల నివారించడానికి రూపొందించారు.

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ఓపిఎస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తోంది. రాష్ట్రాలు తమ బాధ్యతలను నెరవేర్చడానికి కూడా కష్టమవుతుంది. నిర్దిష్ట ప్రయోజనాన్ని అందిస్తుంది. సుస్థిరతకు తగిన కేటాయింపులు లేకుండా ప్రభుత్వంపై అపార భారాన్ని మోపుతోంది. యుపిఎస్ మంచి ఆర్థిక సూత్రాలపై ఏర్పాటు చేశారు. సమతుల్య విధానాన్ని ఇది అందిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం దివాలా తీయకుండా పెన్షన్లు సురక్షితంగా ఉండేటట్టు చూస్తుంది. రాష్ట్రానికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. OPS, NPS రెండిటి లోపాలను చూసి UPS రూపొందించామని సీతారామన్ చెప్పారు.

ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూసి నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్ నిర్మాణం లక్ష్యాలు తో విభిన్నంగా ఉంది. దీనిని అందుకే తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ పెన్షన్ పథకం భారత దేశం లాంటి పెద్ద విభిన్నమైన దేశానికి సేవ చేయడానికి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీర్ఘకాలిక సుస్థిరతను పరిగణలోకి తీసుకోకుండా స్థిరమైన పెన్షన్ హామీ ఇచ్చే OPS లేదా చాలా ఎక్కువ నష్టాన్ని ఉద్యోగులకు తీసుకువచ్చిన NPS లాగ కాకుండా UPS సమతుల్యతను సాధించడానికి ట్రై చేస్తుందని తెలుస్తోంది. పదవి విరమణ చేసిన వారు ప్రయోజనాలను కాపాడుతూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఈ UPSని రూపొందించారు. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంలో ప్రభుత్వ నిబంధనకు ఇది నిదర్శనం.

Read more RELATED
Recommended to you

Latest news