Pension : వెంటనే ఇలా చేయండి.. లేదంటే పెన్షన్ రాదు.. కీలక ప్రకటన చేసిన కేంద్రం..!

-

Pension : ఈరోజుల్లో మోసాలు ఎక్కువైపోతున్నాయి. విపరీతంగా ఆన్లైన్లో మోసాలు చేస్తున్నారు. ఆన్లైన్ మోసాలకి దొరికితే అంతే సంగతి. జేబుకు చిల్లు పడాల్సిందే. పదవీ విరమణ చేసి పెన్షన్ అందుకున్న వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం పింఛన్ల నిర్వహణ చూసే సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ కీలక ప్రకటన చేసింది. జరుగుతున్న మోసాల గురించి హెచ్చరించింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే సొమ్ములను టార్గెట్ చేస్తూ మోసగాళ్లు మోసాలు చేస్తున్నారని వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ మేరకు మెమోరెండం జారీ చేసింది.

అన్ని బ్యాంకులకు చెందిన సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు కీలక ఆదేశాలను జారీ చేసింది. పింఛన్ మోసాలకు సంబంధించి పెన్షనర్లకు అవగాహన కల్పించాలని కోరింది. ఆన్లైన్ మోసాలు ఆందోళన కలిగించే విషయమే. ఆన్లైన్ టెక్నాలజీ పై అవగాహన లేని వాళ్లను టార్గెట్ చేస్తూ కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మోసపూరిత లింకులు పంపిస్తూ ఖాతాలని ఖాళీ చేస్తున్నారు.

కొందరు కేటుగాళ్లు వాట్సాప్ ద్వారా వివిధ రకాల ఫారమ్స్ ని పంపించి వివరాలు నింపకపోతే పెన్షన్ ఆగిపోతుందని భయపెడుతున్నారు. మోసాలకి పాల్పడుతున్నారు. వ్యక్తిగత వివరాలను ఎవరికి ఇవ్వద్దని సూచించింది. పెన్షనర్లకు అలెర్ట్ పంపింది. పెన్షన్లకు సంబంధించిన పీపీఓ నెంబర్, బ్యాంక్ అకౌంట్, పాస్వర్డ్, ఓటీపీ వంటివి ఫోన్ కాల్స్, ఈమెయిల్, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా ఇవ్వద్దని చెప్పింది. ఒకవేళ కనుక మోసగాళ్ల వలలో పడ్డారంటే అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మోసపూరిత కాల్స్ వచ్చినప్పుడు ఫిర్యాదు చేయాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news