ఆ రోజుల పోయాయి.. పాక్ చర్యకు ప్రతిచర్య తప్పదు : జై శంకర్

-

దాయాది పాకిస్తాన్‌తో నిర్విరామ చర్యల కాలం ముగిసిందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ అన్నారు. ఇక మీదట పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టంచేశారు. ‘ఇక జమ్మూకశ్మీర్ అంశానికొస్తే ఆర్టికల్ 370 రద్దు చేశాం. పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలన్నదే అసలు విషయం. మేము అచేతనంగా ఉండము.పరిణామాలు ఎలాంటివైనా వెంటనే స్పందిస్తాం.’ అని చెప్పారు. ఇక పొరుగు దేశం బంగ్లాలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమయానుగుణంగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం బంగ్లాలో నెమ్మదిగా పరిస్థితులు కుదురుకుంటున్నాయని, కొత్తగా ఏర్పాటైన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత్‌తో సత్సంబంధాలు కలిగి ఉంటుందని జై శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధాని మోడీతో బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్ అక్కడి హిందువుల రక్షణకు సంబంధించి చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాలో ఎన్నికలు జరిగి స్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అక్కడి పరిస్థితులపై ఆచితూచి అడుగులు వేస్తామని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news