చాలా కాలం నుండి మీ పీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేసుందా..? అయితే మీకు శుభవార్త. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ నుంచి ఉపసంహరించుకున్న సభ్యులు రూ. 500 డిపాజిట్ చేసి మళ్ళీ వాళ్ళ యొక్క అకౌంట్ ని స్టార్ట్ చెయ్యచ్చని అంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
చాలా రోజుల నుండి మూసివేయబడింది ఖాతాలు ఉంటే సభ్యులు రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా ఖాతాని మళ్లీ ప్రారంభించేందకు అవకాశం ఇచ్చింది. నెలలో కనీసం రూ. 500 చెల్లించి తిరిగి మళ్ళీ అకౌంట్ ని మొదలు పెట్టచ్చు. గతంలో ఈపీఎఫ్‌ఓలో సభ్యులుగా ఉండి, కొన్ని కారణాల వల్ల బయటకి వచ్చేసినట్టైతే నెలలో కనీసం రూ.500 చెల్లించి మళ్లీ చేరచ్చు.
వాళ్ళు తమ నెలవారీ సంపాదనలో రూ. 500 లేదా 13% చెల్లించి రావచ్చంది. 48 లక్షల మంది ఈ సంస్థ నుంచి 2018-20 మధ్యకాలంలో వచ్చేశారని.. కరోనా సమయంలో మరెంత ఎక్కువయ్యింది ఈ సంఖ్య అని తెలుస్తోంది.
ఈపీఎఫ్‌వో కొత్త రూల్ వస్తే లక్షలాది మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఇలా పాత ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం ఈజీ అవుతుంది. ఈపీఎఫ్ స్కీమ్‌లో చేరిన వారికి పెన్షన్, పీఎఫ్, ఇన్సూరెన్స్ వస్తాయి. అలానే ఇతర ప్రయోజనాలను కూడా పొందొచ్చు.