దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపాంతరం మార్చుకొనే దశలో ఉన్నదని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆటోనీ ఫౌసీ తెలిపారు. అమెరికా శాస్త్రవేత్తలు అప్రమత్తంగా ఉన్నారని, కొత్త స్ట్రెయిన్ గురించి సౌతాఫ్రికాలోని శాస్త్రవేత్తలతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఒమిక్రాన్ గురించి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని, వ్యాప్తి చెందే వేగం, రోగ నిరోధక శక్తిని ఏమారుస్తుందో లేదో పరిశీలించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. అయితే, ఒమిక్రాన్‌లో చాలా ఉత్పరివర్తనాలు ఉన్నాయని, అందులో చాలా వరకు పాతవే అన్నారు. కానీ, కొత్త మ్యూటేషన్ల కూడా ఉండటం దృష్ట్యా ఒమిక్రాన్ తీవ్రంగా పరిగణించాల్సి ఉందని తెలిపారు.
దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలపై నిషేధం విధించిన దేశాల జాబితాలో బంగ్లాదేశ్ కూడా చేరింది. అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలలో స్క్రీనింగ్ ప్రక్రియను బలోపేతం చేయాల్సి ఉన్నదని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి జాహిద్ మాలెక్యూ తెలిపారు. ఆరోగ్యపరమైన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగాలకు మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు.