ఆరు బ్యాంకు లను రెండో షెడ్యూల్ నుంచి మినహాయించిన రిజర్వ్ బ్యాంకు…!

-

ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనం తరువాత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబిసి), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ మరియు అలహాబాద్ బ్యాంక్ లను ఆర్బిఐ చట్టం రెండో షెడ్యూల్ నుంచి మినహాయించింది. బుధవారం ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని ఆర్‌బిఐ వెల్లడించింది.

“సిండికేట్ బ్యాంక్‌ను ఏప్రిల్ 1, 2020 నుండి అమలులోకి వచ్చే ఆర్‌బిఐ చట్టం, 1934 రెండవ షెడ్యూల్ నుంచి మినహాయించాలని మేము సూచిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. సిండికేట్ బ్యాంకు ఏప్రిల్ 01 నుండి బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడం నిలిపివేసిందని పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం రెండవ షెడ్యూల్‌లో ఒక బ్యాంకు గురించి ప్రస్తావించినప్పుడు దానిని ‘షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్’ గా పిలుస్తారు. ఈ బ్యాంకులను అన్నీ కూడా ఏప్రిల్ 1 నుండి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో (పిఎస్‌బి)లో విలీనం చేసింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news