చిన్న చిన్న వ్యాపారస్తులు రుణాలకు వెళ్లొద్దు… ఎందుకంటే…!

ఈ రోజుల్లో అవసరాలు పెరగడంతో ప్రజలు అప్పుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు, బ్యాంకు లోన్లు, గ్రామాల్లో అప్పులు చేయడం, విద్య కోసం రుణాలు తీసుకోవడం, వ్యాపారం కోసం రుణాలు తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. దీని కారణంగా ప్రస్తుత అవసరాల నుంచి బయటపడుతూ ఉంటారు. మరి దీని కారణంగా నష్టాలు ఏంటి…? కోల్పోతున్నది ఏంటి అనేది ఎవరూ ఆలోచించడం లేదు… అప్పటి అవసరాన్ని బట్టి ఎంత అప్పు దొరికితే అంత, ఎంత వడ్డీ దొరికితే అంత తీసుకుంటున్నారు.

కాని ఇది అంత మంచిది కాదని అంటున్నారు. ముఖ్యంగా చిన్న ఉద్యోగాలు చేసే వారు, చిన్న వ్యాపారాలు చేసే వారు అప్పుల జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది అని అంటున్నారు నిపుణులు. తక్కువ మొత్తంలో ఇచ్చే రుణానికి ఎప్పుడైనా వడ్డీ ఎక్కువగా ఉంటుంది. దీనితో వ్యాపారాలు చేసే వారు… ఆ వడ్డీ నుంచి బయటపడే క్రమంలో మరో అప్పుకి వెళ్తున్నారు. అక్కడా వడ్డీ భారీగా ఉండటంతో… వ్యాపారం పడిపోయే ప్రమాదం ఉంది. గతంలో అప్పు తీసుకునే వాళ్ళు వేగంగా కట్టేలా అయితేనే తీసుకునే వాళ్ళు గాని… దీర్ఘకాలికం అయితే దానికి జోలికి వెళ్ళే వారు కాదు.

ఇక బ్యాంకుల్లో ఋణం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి… ఎందుకంటే మీరు కట్టలేకపోతే క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది కాబట్టి, భవిష్యత్తులో మీకు నిజంగా ప్రాణం మీదకు వచ్చినా సరే ఋణం దొరికే అవకాశం ఎంత మాత్రం ఉండదు. అప్పుడు వ్యక్తుల దగ్గర ఎక్కువ వడ్డీకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యా రుణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వస్తుంది కదా అని తీసుకుంటే ఉద్యోగం ఆలస్యమై కట్టకపోతే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి. ఆ ఋణం కారణంగా క్రెడిట్ స్కోర్ పడిపోతే మీరు భవిష్యత్తులో రుణాన్ని సమీకరించడం కష్టమవుతుంది. ఉద్యోగాలు చేసే వారు ఆదా చేసుకోవడమే గాని అప్పుకి వెళ్తే మాత్రం భవిష్యత్తు ఇబ్బంది పడుతుందని సూచిస్తున్నారు.