దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. హోమ్ అప్లయెనెన్స్ పై తగ్గింపు ఆఫర్ చేస్తోంది.
మీరు కనుక ఈ ఆఫర్ ని పొందాలి అంటే…. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ వంటి తదితర ప్రొడక్టులని కొనుగోలు చేసి పొందొచ్చు. రూ.1000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. క్రోమా స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేస్తే ఈ సూపర్ ఆఫర్ ని మీరు పొందొచ్చు. లేదంటే క్రోమా వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు కొనచ్చు.
ఎస్‌బీఐ కార్డు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కొనుగోలుదారులు కచ్చితంగా బిల్లు మొత్తాన్ని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లించాలి. జూన్ 27 వరకు ఈ ఆఫర్ అందుబాటు లో వుంది. కనీసం రూ.20 వేలకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీకు అప్పుడే క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది గమనించండి.