పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. రూ.1,500 కడితే లక్ష పొందొచ్చు..!

Join Our Community
follow manalokam on social media

మంచి స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీరు పోస్టాఫీస్‌ అందించే ఈ సూపర్ స్కీమ్ గురించి చూడాలి. దీని వలన మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వీటిల్లో డబ్బులు పెడితే కచ్చితమైన లాభం పొందొచ్చు. రిస్క్ ఉండదు. పలు రకాల స్కీమ్స్ ఉంటాయి వాటిలో రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి.

post office
post office

దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పై ఇప్పుడు 5.8 శాతం వరకు వడ్డీ వస్తోంది. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఇక ఎలా డబ్బులు వస్తాయి అనే విషయానికి వస్తే.. ఐదేళ్లు పాటు నెలకు రూ.1500 కడితే మొత్తం డబ్బు రూ.90 వేలు అవుతుంది.

దీనికి రూ.14,500 వడ్డీ వస్తుంది. అంటే మీకు మెచ్యూరిటీ కాలంలో చేతికి రూ.లక్షకు పైగా డబ్బులు వస్తాయి. ఇలా మీరు మంచి రాబడి పొందొచ్చు. రూ.100 నుంచి కూడా డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.

ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. పైగా ఇందులో ఏ రిస్క్ ఉండదు. రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసిన వారు స్కీమ్ టెన్యూర్ ముగిసే వరకు డబ్బులు ప్రతి నెలా డిపాజిట్ చెయ్యాలి. అలానే స్కీమ్‌పై వడ్డీ మొత్తం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఆర్‌డీ అకౌంట్‌కు వస్తుంది.

 

 

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...