పెద్దలు తప్పుగా అర్థం చేసుకునే యువత చేసే కొన్ని పనులు.. మీరూ ఇలానే ఆలోచిస్తున్నారా?

-

టీనేజీ వచ్చాక పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకూ పిల్లల్లాగా చూసిన పెద్దలు, అప్పటి నుండి ఓ కంట కనిపెడుతూ ఉంటారు. వారేం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అనే విషయాలని గమనిస్తూ ఉంటారు. ఐతే ఇక్కడ కొన్ని విషయాల్లో పెద్దలు యువతని తప్పుగా అర్థం చేసుకునే అవకాశమూ ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఫోన్ వంక చూస్తూ చిన్నగా నవ్వుతున్నారంటే వారికి గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో ఉందని అర్థం కాదు. కొంత మంది మీమ్ లవర్స్ అయి ఉండవచ్చు. అందులో కనిపించిన ఒక జోక్ వారికి నవ్వు తెప్పించి ఉండవచ్చు.

ఏ విషయమూ చెప్పట్లేదని బాధపడకండి. దానర్థం మీరంటే నమ్మకం లేక కాదు. జీవితంలో వారికి ఎదురొచ్చే అడ్డంకులని వారే తొలగించుకోవాలనే ప్రయత్నం అయి ఉండవచ్చు. మీరు నేర్చుకున్నట్టుగానే వారినీ జీవిత పాఠాలు నేర్చుకోనివ్వండి.

మీటింగుల్లో ఫోన్ రింగ్ అయ్యిందంటే కారణం అది కావాలని చేసింది కాదు, కొన్ని సార్లు సైలెంట్ లో మర్చిపోయి ఉండవచ్చు. అసలు అలా మర్చిపోవద్దని అంటారా? మీ ఫోన్ కూడా అలా చాలా సార్లు మోగే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోండి.

ఫోన్ కి లాక్ వేసుకున్నారంటే దానర్థం అందులో ఉన్న విషయాలు మీరు చూడకూడదని దాస్తున్నారని కాదు. వారు కొద్దిగా ప్రవసీ కోరుకుంటున్నారని అర్థం. ఆ మాత్రం ప్రైవసీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా అని పూర్తిగా ఫోన్లో మునిగిపోయి, బయట విషయాలని పెద్దగా పట్టించుకోకుండా ఉంటే పెద్దలు పట్టించుకోవాల్సిందే.

ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే మీరంటే ప్రేమ లేదని కాదు. వాళ్ళేదో సమస్యతో పోరాడుతూ దాన్నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారేమో! ఆ ప్రయత్నం సఫలం అయ్యాక వారే మీతో బాగా మాట్లాడతారు. ఒంటరితనం మరీ ఎక్కువ రోజులు ఉంటే పెద్దలు రంగంలోకి దిగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news