అరటి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బయటకెళ్ళినపుడు ఆకలి దంచేస్తూ ఉంటే, హోటళ్ళలో తినడం ఇష్టలేకపోతే, ఏదైనా పండు తిందాం అన్న ఆలోచన వచ్చినపుడు, ఏ పండైతే ఆకలి తీరుతుందన్న ఆలోచనకి అరటి పండు మాత్రమే గుర్తుకు వస్తుంది. అరటి పండు ఆకలి తీర్చడానికే కాదు ఆరోగ్యానికీ మంచిదే. ఐతే ఏ టైమ్ లో తినాలి? ఎలాంటి అరటి పండు తినాలనేది చాలా మందికి తెలియని విషయం. అరటి పండుని ఇష్టపడేవారు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ఎప్పుడైనా సరే అరటి పండుని ఆహారంగా తీసుకోవాలనుకుంటే, ఒక్క అరటి పండు మాత్రమే తినాలి. మరే ఆహారంతోనూ దాన్ని కలుపుకోవద్దు. ఇతర పండ్లతో పాటు తినకపోవడమే మంచిది. చాలా మంది భోజనం చేసాక, పాలల్లో తినాలని చెబుతుంటారు. కానీ అలా కాకుండా కేవలం అరటి పండుని మాత్రమే తినాలి.
అరటి పండుని ఏ టైమ్ లో తినాలంటే,
వర్కౌట్లు చేసిన తర్వాత అరటి పండుని తినవచ్చు. వర్కౌట్లలో మీ శక్తి నష్టపోతుంది. కాబట్టి, మీకు తొందరగా శక్తినిచ్చే పండ్లలో అరటి పండు మేలైనది.
అలాగే సాయంత్రం పూట స్నాక్స్ తినే అలవాటున్న వారు చిప్స్, మిరపకాయ బజ్జీ జోలికి వెళ్ళకుండా ఆరోగ్యకరమైన సాయంత్రాన్ని ఆహ్లాదంగా చేసేందుకు అరటి పండుని స్నాక్స్ లాగా తినండి.
రాత్రిపూట అస్సలు తినవద్దు. భోజనం చేసేటపుడు, భోజనం చేసిన తర్వాత అస్సలు ముట్టుకోవద్దు.
ఎలాంటి అరటి పండుని తినాలి?
పండుగా అవుతున్న అరటి పండు.
చక్కెర నిల్వలు తక్కువగా ఉన్న అరటి పండు కావాలంటే ఇంకా పూర్తిగా పండుగా మారని అరటి పళ్ళని తినాలి.
పండుగా మారిన తర్వాత
పూర్తిగా పండుగా మారిన అరటి పండు తియ్యగా ఉంటుంది. తొందరగా జీర్ణం అవుతుంది. అధిక యాంటీఆక్సిడెంట్లని కలిగి ఉంటుంది.
పండుగా మారి గోధుమ రంగు మచ్చలు ఏర్పడితే,
ఎక్కువ తియ్యదనం కలది, యాంటీఆక్సిడెంట్లు అధికం. స్వీట్ తినాలన్న కోరిక కలిగినపుడు ఆరోగ్యకరమైన ఆహారం.