టెలిగ్రామ్‌ యాప్‌లో మరో సరికొత్త ఫీచర్‌!

-

గోప్యంగా ఉండే మెసేజ్‌లు చేసుకోగలిగిన టెలిగ్రామ్‌ యాప్‌ ఇప్పుడు భారత్‌లో చాలా వేగంగా యూజర్లకు చేరువవుతోంది. ప్రపంచవ్యాప్తంగానూ టెలిగ్రామ్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. అందుకే వినియోగదారులకు మరింత చేరువ కావడం కోసం యాప్‌ డెవలపర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

వాట్సాప్‌ ఇటీవల కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం వల్ల టెలిగ్రామ్‌ యాప్‌కి వినియోగదారుల సంఖ్య పెరిగింది. రోజురోజుకీ పెరుగుతున్న వినియోగదారులను మెప్పించడానికి టెలిగ్రామ్‌ కొత్త ఫీచర్లను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. సాధారణంగా ఎవరైనా తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగానే ఉంచుకోవాడానికే మొగ్గుచూపడం సహజం. అలాంటిది వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త పాలసీ దీనికి వ్యతిరేకంగా ఉండటంతో వినియోగదారుల్లో ఆ యాప్‌పై వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ప్రత్యామ్నాయ యాప్‌లు వెదుకుతున్నారు. మిలియన్ల కొద్దీ జనం సెక్యూరిటీ ఎక్కువగా ఉండే చాటింగ్‌ వేదికలకు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే టెలిగ్రామ్‌ యాప్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగానూ టెలిగ్రామ్‌ కు డిమాండ్‌ పెరుగుతోంది. అందుకే వినియోగదారులకు మరింత చేరువ కావడం కోసం కొత్త ఫీచర్లతో, ఆప్‌డేట్లతో ముందుకు వచ్చే పనిలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో టెలిగ్రామ్‌ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ చేసింది. ఛానల్స్‌లో వాయిస్‌ చాట్‌ సపోర్టును యాడ్‌ చేసింది. వాయిస్‌ చాట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని మరింత మెరుగుపరచడం కోసం ఈ ఫీచర్‌లో మరిన్ని అప్‌డేట్‌లు కూడా చేసింది. ఇప్పుడు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం బీటా చానల్‌ పైన మరో అప్‌డేట్‌ను చేర్చింది.

ఇటీవలి నివేదికల ప్రకారం బీటా ఛానల్‌పై టెలిగ్రామ్‌ వి7.7.0 రావడం మొదలయ్యింది. ఇది వాయిస్‌ చాట్‌లల్లో కొత్త షెడ్యులింగ్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ వాయిస్‌ చాట్‌ ను షెడ్యుల్‌ చేయడం కోసం, అడ్మిన్
లు చానల్‌ ఐకాన్స్‌పైన, అలాగే త్రీ–డాట్‌ సెట్టింగ్స్‌పైన ట్యాప్‌ చేయాలి. చీస్టార్ట్‌ వాయిస్‌ చాట్‌చీ ఆప్షన్
ను సెలక్ట్‌ చేసుకోని, తర్వాత కొత్త చీషెడ్యుల్‌ వాయిస్‌ చాట్‌చీ ఆప్షన్ పైన ట్యాప్‌ చేయాలి. అప్పుడు అడ్మిన్లు తేదీని, సమయాన్ని ఎంచుకోవచ్చు. తర్వాత వాయిస్‌ చాట్‌ షెడ్యుల్‌ చేసుకోవడం కోసం కిందున్న బటన్
సెలక్ట్‌ చేసుకోవాలి. రిపోర్టు ప్రకారం, సభ్యులందరికీ కౌంట్‌డౌన్ తో సహా షెడ్యుల్‌ వాయిస్‌ చాట్‌ నోటిఫికేన్‌ చానల్‌ పై భాగంలో కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన ఈ షెడ్యులింగ్‌ ఫీచర్‌ హ్యాండీ ఎడిషన్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version