UPI ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే తప్పక వీటిని అనుసరించండి..!

-

యుపిఐ UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అనేది ఒక ప్రత్యేకమైన చెల్లింపు వ్యవస్థ. ఈ యుపిఐ ని ఉపయోగించి బ్యాంక్-టు-బ్యాంక్ బదిలీలను చేయవచ్చు. డబ్బును ఒక యుపిఐ యాప్ నుండి ఇతర యుపిఐ ఎనేబుల్ చేసిన యాప్ కి పంపచ్చు. డబ్బు బదిలీ చేసేటప్పుడు ఈ సేఫ్టీ రూల్స్ పాటిస్తే మంచిది.

UPI

దీని కోసం మీరు మొదట డబ్బును ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలుసుకోండి. చెల్లింపును ప్రారంభించే ముందు మీరు ఆ వ్యక్తి యొక్క యుపిఐ ఐడిని తెలుసుకుని ఉండాలి. మరొక వ్యక్తికి ఇమెయిల్ పంపడానికి మీకు ఇమెయిల్ ఐడి ఎలా తెలియాల్సి ఉందో.. అదే విధంగా మీరు డబ్బు పంపించాలనుకునే వ్యక్తి యొక్క యుపిఐ ఐడి తెలుసుకు ఉండాలి.

ప్రతి యుపిఐ యూజర్ వారికి ప్రత్యేకమైన యుపిఐ ఐడిని కేటాయించారు. ఇది యుపిఐలో నమోదు చేసేటప్పుడు సృష్టించబడుతుంది. ఈ యుపిఐ ఐడి ద్వారా, యూపీఐ ఎనేబుల్ చేసిన ఏదైనా యాప్ ద్వారా యూజర్లు డబ్బు పంపవచ్చు మరియు పొందొచ్చు. మీరు మీ యుపిఐ ఐడిని మరచిపోయినట్లయితే, మీ యుపిఐ ప్రారంభించబడిన యాప్ యొక్క ప్రొఫైల్ పేజీని చూడండి.

ఇది ఇలా ఉంటే మీరు మీ యొక్క ఏటీఎం పిన్ ని ఎలా అయితే ఉంచుకుంటారు. అదే విధంగా యూపీఐ పిన్ నెంబర్ కూడా ఉంచుకోవాలి. యూపీఐ పిన్ అనేది 4 నుండి 6 డిజిట్ నెంబర్స్ తో ఉంటుంది. దీనిని ఎంటర్ చేయకుండా డబ్బులు పంపించడం కుదరదు. ప్రతిసారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. యూపీఐ పిన్ ని ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ జరుగుతుంది.

SMS నోటిఫికేషన్‌లలో డెబిట్ చేసిన మొత్తాన్ని చెక్ చెయ్యండి. లావాదేవీ పూర్తయిన వెంటనే డెబిట్ చేసిన డబ్బు SMS అందుతుంది. బదిలీ చేయబడిన మొత్తాన్ని నిర్ధారించడానికి ఈ SMS ఎల్లప్పుడూ చెక్ చెయ్యడం మంచిది.

ఏదైనా సమస్యల కోసం యుపిఐ యాప్ లో ‘యుపిఐ-హెల్ప్’ విభాగాన్ని చెక్ చెయ్యడం మంచిది. చెల్లింపు ప్రక్రియలో లేదా లావాదేవీతో సమస్య ఉంటే, యుపిఐ-హెల్ప్ ద్వారా యుపిఐ యాప్‌లోనే తక్షణ పరిష్కారం తీసుకోండి. మీ సమస్యలను పరిష్కరించడానికి యుపిఐ-సహాయ విభాగం హెల్ప్ అవుతుంది.

ఈ నాలుగు ముఖ్యమైన టిప్స్ ని అనుసరించడం వలన చేసిన ప్రతి చెల్లింపు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఇలా సేఫ్ పేమెంట్స్ చెయ్యడం వలన నష్టపోకుండా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version