ఆధార్ కార్డులో ఏ అప్‌డేట్ చేయాలన్నా కనీసం వంద ఖర్చు అవుతుంది. పైగా ప్రతి పనికి ఆధార్ కీలకం అయిపోయిందాయే. ఆధార్‌లో పేరులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా అంతే.. ఆ పని ముందుకెళ్లదు. అందుకే దీనిలోని డేటా అప్-టు-డేట్ ఉండేలా చూసుకోవాలి. ఇందుకు సపోర్టింగ్ డాక్యుమెంట్లను ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి కనీసం పదేళ్లకొకసారి ఆధార్‌లో అప్‌డేట్ చేసుకోవాలి.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు myAadhaar పోర్టల్‌లో ఫ్రీ అప్‌డేషన్ సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రజలు తమ ఆధార్ డాక్యుమెంట్స్ ఎటువంటి ఖర్చు లేకుండా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డ్ ఫ్రీగా అప్‌డేట్ చేసే ప్రాసెస్ :
ముందు https://myaadhaar.uidai.gov.in/లో myAadhaar పోర్టల్‌కి ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి.
మెనూలో ‘డాక్యుమెంట్ అప్‌డేట్ (Document Update)’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఆధార్‌లో ఉన్న ప్రస్తుత వివరాలు డిస్‌ప్లే అవుతాయి.
వివరాలు వెరిఫై చేసి, నెక్స్ట్ హైపర్‌లింక్‌పై క్లిక్ చేయాలి.
డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ సెలక్ట్ చేసుకోవాలి.
అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్‌లోడ్ చేయాలి. అవి చాలా క్లియర్‌గా, కలర్డ్ కాపీలై ఉండాలి.
ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం అందించే సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌లో పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడీ కార్డు, రేషన్ కార్డు ఇలా ఏదైనా ఉండొచ్చు. నేమ్, డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఓటరు కార్డు, పాస్‌పోర్ట్ వంటి వాటిని సబ్మిట్ చేయాలి.
డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్‌పై నొక్కాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. UIDAI వెబ్‌సైట్‌లో అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు.
ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు :
ఫ్రీ అప్‌డేషన్ సర్వీస్ సెప్టెంబర్ 30 వరకు myAadhaar పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఆధార్ సెంటర్లలో అప్‌డేట్ చేయించాలనుకునేవారు రూ.50 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
రెగ్యులర్ అప్‌డేట్స్ : ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేటింగ్ రూల్స్, 2016 ప్రకారం, ఆధార్ నంబర్ హోల్డర్‌లు ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి కనీసం పది సంవత్సరాలకు ఒకసారి తమ సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవచ్చు. తద్వారా ఆధార్ కార్డులో కచ్చితమైన డేటా ఉండేలా చూసుకోవచ్చు.
దీని ఫలితంగా ఆధార్ కార్డు ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ సేవలను ఎలాంటి అంతరాయాలు కలగకుండా పొందవచ్చు. ఎక్స్‌ట్రా ఛార్జీలను నివారించడానికి, ఆధార్ సమాచారాన్ని అప్-టు-డేట్ ఉంచడానికి సెప్టెంబర్ 30లోపు myAadhaar పోర్టల్‌లో ఫ్రీ అప్‌డేషన్ సేవను సద్వినియోగం చేసుకోవడం మంచిది.